తెలంగాణ

telangana

ETV Bharat / state

యువతి ఆత్మహత్య...

జగిత్యాల జిల్లా దంపేటలో యువతి ఆత్మహత్య కలకలం రేపింది. ప్రేమ పేరిట వేధింపులతో మనస్తాపానికి గురైన హర్షిత ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.

మృతురాలి తల్లి కంటతడి

By

Published : Feb 9, 2019, 7:13 AM IST

మృతురాలి తల్లి కంటతడి
జ‌గిత్యాల జిల్లా క‌థ‌లాపూర్ మండ‌లం దంపేట గ్రామంలో ప్రేమ పేరిట వేధించడంతో ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన దినేష్, హర్షితను త‌న‌కు ఇచ్చి పెళ్లి చేయాల‌ని ఆమె కుటుంబంపై గ‌త కొద్ది రోజులుగా ఒత్తిడి తెస్తున్నాడు. మ‌న‌స్తాపానికి గురైన హ‌ర్ష‌ిత ఇంట్లో ఎవ‌రు లేని స‌మ‌యంలో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. మృతదేహాన్ని పంచ‌నామా నిమిత్తం కోరుట్ల ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతురాలి త‌ల్లి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ామని ఎస్ఐ నాగేశ్వ‌ర్​రావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details