తెలంగాణ

telangana

ETV Bharat / state

YSRTP: 'నిరుద్యోగులతో 100 నుంచి 200 నామినేషన్లు వేయిస్తాం​' - hyderabad district latest news

హుజూరాబాద్​ ఉప ఎన్నికలో 100 నుంచి 200 మంది నిరుద్యోగులతో నామినేషన్లు వేయిస్తామని వైఎస్​ఆర్​టీపీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్​రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇందిరాశోభన్​ రాజీనామాపై స్పందించారు.

YSRTP: 'నిరుద్యోగులతో 100 నుంచి 200 నామినేషన్లు వేయిస్తాం​'
YSRTP: 'నిరుద్యోగులతో 100 నుంచి 200 నామినేషన్లు వేయిస్తాం​'

By

Published : Aug 21, 2021, 5:03 PM IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్​ రాజీనామాతో ఎన్నికలు అనివార్యమైన హుజూరాబాద్​లో 100 నుంచి 200 మంది నిరుద్యోగులతో నామినేషన్లు వేయిస్తామని వైఎస్​ఆర్​టీపీ (YSRTP) అధికార ప్రతినిధి తూడి దేవేందర్​రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే తమ పోరాటమని ఆయన స్పష్టం చేశారు. లోటస్​పాండ్​లోని వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ కార్యాలయం(party office) లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఆరు చోట్ల వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల నిరుద్యోగ దీక్షలు చేపట్టారని దేవేందర్​రెడ్డి పేర్కొన్నారు. 7వ నిరుద్యోగ దీక్ష వచ్చే మంగళవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్​లో నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. తాము చేరికల కోసం పని చేయడం లేదని.. క్యాడర్​ని కొత్తగా తయారు చేసే పనిలో ఉన్నామన్నారు. ఇందిరా శోభన్​ని నాయకురాలిగా తయారు చేశామని.. ఆమె పార్టీని వీడటం వల్ల ఎలాంటి నష్టం లేదని దేవేందర్ రెడ్డి వివరించారు.

YSRTP: 'నిరుద్యోగులతో 100 నుంచి 200 నామినేషన్లు వేయిస్తాం​'

'హుజూరాబాద్​లో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. గత కొంత కాలంగా ఉప ఎన్నికల సందర్భంగా మాత్రమే ప్రభుత్వం పని చేస్తున్న తీరు మనం చూస్తున్నాం. ఈ హుజూరాబాద్​ ఎన్నికల ద్వారా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఇందుకోసం 100 నుంచి 200 మంది నిరుద్యోగులతో ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేయిస్తాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6 చోట్ల నిరుద్యోగ దీక్షలు చేసిన షర్మిల.. 7వ దీక్ష మంచిర్యాల జిల్లాలో చేస్తారు.'

- తూడి దేవేందర్​రెడ్డి, వైఎస్​ఆర్​టీపీ అధికార ప్రతినిధి

వైఎస్​ఆర్​టీపీకి ఇందిరా శోభన్​ బైబై..

వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఇందిరా శోభన్ శుక్రవారం రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజనామా చేసినట్లు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజీనామా లేఖను వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పంపారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు.

ఇదీ చూడండి: YSRTP: షర్మిలకు షాక్.. వైతెపాకు ఇందిరాశోభన్ రాజీనామా

ABOUT THE AUTHOR

...view details