MP RRR ON SIT NOTICES : "తెరాస ఎమ్మెల్యేలకు ఎర" కేసులో తనకు తెలంగాణ సిట్ నోటీసులు అందాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు. దిల్లీలోని తన నివాసంలో సిట్ నోటీసులు అందజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 29న బంజారాహిల్స్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించినట్లు చెప్పారు.
ఎమ్మెల్యేల ఎర కేసు.. సిట్ నోటీసులపై ఎంపీ రఘురామ రియాక్షన్ ఇదే! - RRR ON SIT NOTICES
MP RRR ON TS SIT NOTICES : "తెరాస ఎమ్మెల్యేలకు ఎర" కేసులో సిట్ నోటీసులిచ్చారన్న వార్తలపై వైసీపీ ఎంపీ రఘురామ స్పందించారు. దిల్లీలోని తన నివాసంలో సిట్ నోటీసులు అందజేశారని స్పష్టం చేశారు.
RRR
దర్యాప్తులో భాగంగా ఎంపీ రఘురామకు సంబంధించిన పలు కీలక విషయాలను సిట్ సేకరించినట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే ఆయనకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లు నిందితులుగా ఉండగా.. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు డా.జగ్గుస్వామి, బీడీజేఎస్ నేత తుషార్, కరీంనగర్ న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌లను నిందితుల జాబితాలో సిట్ కొత్తగా చేర్చింది.
ఇవీ చదవండి: