జాతీయ చేనేత దినోత్సవం(national handloom day) సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే ‘నేతన్న నేస్తం’ మూడో విడత సాయాన్ని ఈ నెల 10వ తేదీన అందించనున్నారు. ఈ పథకం కింద సొంత మగ్గం ఉన్న కార్మికులకు రూ.24 వేలు ఇస్తారు. పథకాన్ని లబ్ధిదారులకు చేరువ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
NETHANNA NESTHAM: 10 నుంచి 'నేతన్న నేస్తం' మూడో విడత సాయం
ఏపీలో చేనేత కార్మికులకు వైకాపా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే ‘నేతన్న నేస్తం’ మూడో విడత సాయాన్ని ఈ నెల 10వ తేదీన అందించనుంది.
నేతన్న నేస్తం
శనివారం నుంచి మూడు రోజులపాటు ప్రచారాన్ని నిర్వహించాలని గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కార్మికులు స్థానికంగా చేనేత సంఘంలో రిజిస్ట్రర్ అయి ఉన్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:CM KCR: చేనేత కార్మికులు, పద్మశాలీలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు