ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారంచేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కుమార్తె సునీత సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. వివేకానంద రెడ్డికి ప్రజల్లో మంచి పేరుందని... దానిని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
కల్పిత పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోండి చర్యలు తీసుకోండి
తండ్రి మరణంపై సామాజిక మాధ్యమాల్లో కల్పితాలను పోస్టు చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఆయన మరణంతో తీవ్ర దుఖంలో ఉన్న తమకు ఇలాంటి వార్తలు మరింత బాధ కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:జోరుగా కొనసాగిన నామినేషన్ల పర్వం