తెలంగాణ

telangana

ETV Bharat / state

'వివేకా హత్య కేసు.. రాజకీయ కారణాలపై సీబీఐ దర్యాప్తులో తేలిపోతాయి' - YS Sharmila latest news

YS Sharmila respond on Viveka murder case: ఏపీలో వివేకా హత్య కేసు దర్యాప్తుపై వైఎస్​ షర్మిల స్పందించారు. దర్యాప్తును సుప్రీంకోర్టు మరో రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. వివేకా హత్య తమ కుటుంబంలో జరిగిన దారుణమని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

YS Sharmila respond on Viveka murder case
YS Sharmila respond on Viveka murder case

By

Published : Oct 21, 2022, 2:27 PM IST

YS Sharmila respond on Viveka murder case: ఆంధ్రప్రదేశ్​లో వివేకా హత్య కేసు దర్యాప్తుపై వైఎస్​ షర్మిల స్పందించారు. దర్యాప్తును సుప్రీంకోర్టు మరో రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు. వివేకా హత్య తమ కుటుంబంలో జరిగిన ఘోరమని అన్నారు. వివేకా కుమార్తె సునీతారెడ్డికి న్యాయం జరగాలన్నారు. తమ చిన్నాన్నను ఘోరంగా ఎవరు హత్య చేశారో బయటకి రావాలని తెలిపారు.

వివేకా హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరుకున్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తును ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వివేకా హత్య కేసుకు రాజకీయ కారణాలపై సీబీఐ దర్యాప్తులో తేలిపోతాయని వైఎస్​ షర్మిల వ్యాఖ్యానించారు.

వివేకా హత్య కేసు.. రాజకీయ కారణాలపై సీబీఐ దర్యాప్తులో తేలిపోతాయి:షర్మిల

ABOUT THE AUTHOR

...view details