YS Sharmila Got Indian Book Of Records : తెలంగాణలో 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 3,800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించారని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు తెలిపారు. వారు లోటస్ పాండ్‌లోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో షర్మిలను కలిసి అభినందించారు. అనంతరం అవార్డును ప్రదానం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఉద్దేశంతో షర్మిల ప్రజాప్రస్థాన(Praja Prastanam) యాత్ర పేరుతో పాదయాత్ర చేసింది.
One and Half Year Sharmila Padayatra in TS: 2021 అక్టోబర్ 21న ఆమె తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టిన ప్రదేశం చేవెళ్ల నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో ఆమెకు ఎన్ని అడ్డకుంలు వచ్చిన వాటిని ఎదుర్కొని కొనసాగించారు. వరంగల్ జిల్లాలో ఎన్ని ఉద్రిక్తత పరిస్థితులు వచ్చిన కోర్టుకు వెళ్లి మరీ.. అనుమతులు తెచ్చుకొని పాదయాత్ర కొనసాగించారు. దాదాపు సంవత్సరం ఆరు నెలలు ఈ యాత్ర కొనసాగింది.
YS Sharmila Praja Prastanam Details in Telangana : ప్రజాప్రస్థాన పాదయాత్రలో ఆమె బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో కొన్ని చోట్ల ఆమె యాత్రకు పోలీసులు ఆటంకం కలిగించారు. మరికొన్ని సార్లు జైలుకి కూడా వెళ్లారు. అయినా ఆమె పట్టు వదలని విక్రమార్కునిలా పాదయాత్రను కొనసాగించింది. ఇటీవలే వైఎస్సాఆర్ పుట్టిన రోజు సందర్భంగా పాలమూరులో మరల తన పాదయాత్రను త్వరలో మొదలు పెడతానని ప్రకటించారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పాదయాత్ర చేసినా.. తెలంగాణలో చేసినంత సుదీర్ఘంగా చేయలేదు.
YS Sharmila Tweet on KCR : కేసీఆర్‌కు షర్మిల సవాల్.. దమ్ముంటే సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వండి..