వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై షర్మిలతో పాటు మరో ఆరుగురికి నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. మధ్యాహ్నం ప్రగతి భవన్ వద్ద ఆందోళన నిర్వహించినందుకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రాత్రి 9 గంటల సమయంలో నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయమూర్తి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించారు. అంతకు ముందు విచారణ సమయంలో షర్మిలపై తప్పుడు కేసులు పెట్టారని షర్మిల తరఫు న్యాయవాదులు వాదించారు. శాంతియుత నిరసనకు వెళ్తుంటే అరెస్ట్ చేశారని కోర్టులో ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి అరెస్ట్ చేసిన అందరికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేశారు.
YS Sharmila got bail: వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు - నాంపల్లి కోర్ట్
YS Sharmila
22:01 November 29
వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు
Last Updated : Nov 29, 2022, 10:19 PM IST