YS Sharmila apologized to Transgenders: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా ట్రాన్స్‌జెండర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మహబూబాబాద్‌లో షర్మిల.. తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ.. హిజ్రాలు ఫైర్ అవుతున్నారు. షర్మిల వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని ట్రాన్స్‌జెండర్లు డిమాండ్ చేశారు. షర్మిల ఫ్లెక్సీలు సైతం దగ్ధం చేయడంతో వారి ఆందోళనపై ఆమె రియాక్ట్ అయ్యారు.
తన మాటలపై ట్రాన్స్‌జెండర్లు బాధపడితే.. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ క్షమాపణ కోరుతుందని పేర్కొన్నారు. వైఎస్ఆర్‌టీపీ అధికారంలోకి వచ్చాక హిజ్రాలను ఆదుకునే బాధ్యత తమది అని హామీనిచ్చారు. హిజ్రాల విషయంలో వారి మనోభావాలను కించపరిచినట్లు భావిస్తే... అందుకు క్షమాపణ చెప్తున్నట్లు తెలిపారు. వారికి బేషరతుగా క్షమాపణలు కోరారు. ఎమ్మెల్యే విషయంలో తానూ హిజ్రాల గురించి తప్పుగా మాట్లాడిందేమీ లేదని ఆమె అన్నారు.
ఉద్దేశపూర్వకంగా హిజ్రాల పట్ల తప్పుగా మాట్లాడలేదు. హిజ్రాల మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు కోరుతున్నా.. తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి. బీఆర్ఎస్ నేతలు గుండాల వలే వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాలపై బీఆర్ఎస్ నేతలు దాడులకు దిగుతున్నారు. - షర్మిల, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు