Young Man and Young Woman Commits Suicide: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరంలో ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. గోవిందరాజస్వామి ఆలయ ఉత్తరమాడ వీధిలోని ఓ ప్రైవేట్ లాడ్జికి నిన్న ఉదయం 7 గంటల సమయంలో.. యువతీ, యువకుడు వచ్చారని పోలీసులు తెలిపారు. 24 గంటలు గడిచినా వారు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
లాడ్జ్‌లో యువతి, యువకుడు ఆత్మహత్య - లాడ్జ్‌లో యువతి యువకుడి ఆత్మహత్య
Young Man and Young Woman Commits Suicide: ఏపీలోని తిరుపతిలో ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. మృతులు హైదరాబాద్‍కు చెందిన కృష్ణారావు, తూర్పుగోదావరికి చెందిన అనూషగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
Suicide
అక్కడికి చేరుకున్న పోలీసులు గది తలుపులు పగులగొట్టి చూడగా వారిద్దరు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉన్నారు. వారి వద్ద ఉన్న ఆధారాల ప్రకారం.. మృతులు హైదరాబాద్‍కు చెందిన కృష్ణారావు, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన అనూషగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: