ప్రేమ విఫలమైందనే మనస్తాపంతో ఓ న్యూస్ ఛానల్లో పనిచేసే ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిద్దిపేటకు చెందిన పి.రాములు కుమార్తె కల్యాణి (26) ఓ న్యూస్ చానల్లో విధులు నిర్వహిస్తూ, గత రెండేళ్లుగా అదే ఛానల్లో పనిచేస్తున్న ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఇటీవల తనను వివాహం చేసుకోవాలని కల్యాణి కోరగా, అతను నిరాకరించడం వల్ల తాను బతకడం వృథా అని భావించిన ఆమె.. బోలక్ పూర్లోని తన సోదరుడు సుమన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
సుమన్ విధులు ముగించుకుని వచ్చేసరికి కల్యాణి మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ సమాచారం తెలుసుకున్న గాంధీనగర్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరిలించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ కేసును గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ విఫలమైందని.. యువతి ఆత్మహత్య - crime news
ప్రేమ విఫలమై మానసిక ఆందోళనకు గురైన ఓ యువతి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రేమ విఫలమైందని ఓ యువతి ఆత్మహత్య
ఇవీ చూడండి: బ్యాంకు అధికారినంటూ టోకరా.. లక్షా 90వేలు మాయం