వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్న కన్న తల్లిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ కూతురు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఆరేళ్ల క్రితం తన తండ్రి మరణించిన అనంతరం తల్లి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు తెలిపింది. కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన బాధిత యువతి హైకోర్టు న్యాయవాది సయ్యద్ సలీంతో కలిసి హెచ్చార్సీలో ఫిర్యాదు చేసింది.
కుమార్తెను వ్యభిచారం చేయాలంటూ తల్లి ఒత్తిడి - కరీంనగర్ జిల్లా
కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి.. కుమార్తెను వ్యభిచారం చేయాలంటూ బలవంతం చేసింది. చదువుకోసం హైదరాబాద్ వెళ్లినా వేధించండం ఆపలేదు. చివరికి ఓపిక నశించిన కుమార్తె తల్లిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది.
తన అక్క , చెల్లెల్లను తల్లి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించిందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను చదువుకోవాలనే ఉద్దేశంతో తల్లివద్ద నుంచి దూరంగా హైదరాబాద్‌లో తన బాబాయ్ వద్ద ఉంటున్నానని పేర్కొంది. లా చదవాలనే తపనతో నగరానికి వచ్చి చదువుతుంటే, తల్లి అక్రమంగా బాబాయ్‌పై కిడ్నాప్ కేసు పెట్టి వేధిస్తున్నారంటూ వివరించింది. వ్యభిచారం చేయలంటూ బలవంతం చేస్తూ, తన బాబాయ్‌పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న తల్లిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు కమిషన్‌ను వేడుకుంది.
ఇదీ చూడండి : 'ఇప్పటికీ హెరిటేజ్ కమిటీ ఏర్పాటు కాలేదు'