హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పండుగ పూట దారుణం చోటు చేసుకుంది. బోడుప్పల్‌లోని సాయిరాం కాలనీలో ఉంటున్న యువ దంపతులు అక్షత్(26), చైతన్య(24) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పండుగ పూట విషాదం... యువ దంపతుల బలవన్మరణం - young couple committed suicide due to financial problems
పండుగ పూట సంతోషంగా గడపాల్సిన ఆ దంపతులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నెలల పసిగుడ్డును వదిలేసి దేవుని దగ్గరకు పయనమయ్యారు. ఆర్థిక ఇబ్బందులనే తాత్కాలిక సమస్యకు... చావే శరణ్యమని శాశ్వత పరిష్కారాన్ని వెతికారు.
యువ దంపతుల బలవన్మరణం... ఆర్థిక ఇబ్బందులే కారణం!
ఏపీలోని కడప జిల్లా చంపాడు గ్రామానికి చెందిన ఈ దంపతులు జీవనోపాధి కోసం బోడుప్పల్ వచ్చారు. అందరూ సంక్రాంతి సంబురాల్లో ఉన్న వేళ.. వారు తనువు చాలించారు. వీరికి నెల వయస్సు గల కూతురు ఉంది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- ఇవీ చూడండి : నేడు తెరాస అభ్యర్థులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్
Last Updated : Jan 16, 2020, 12:50 PM IST