కదులుతున్న బస్సులోంచి దిగుతుండగా.. - narayanaguda
హైదరాబాద్లో కదులుతున్న బస్సులోంచి దిగడానికి ప్రయత్నించి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. బస్సు వెనుక చక్రం తలపై నుంచి వెళ్లటంతో అక్కడికక్కడే చనిపోయాడు.
ఖమ్మం జిల్లా జోగులపాడుకు చెందిన బండారి ఉదయ్ కిరణ్ నారాయణగూడలో ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ... అరోరా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రామంతాపూర్లోని మేనమామ ఇంటికి వెళ్లి... వసతిగృహంకు చేరుకునేందుకు మియాపూర్ డిపో బస్సులో బయలుదేరాడు. నారాయణగూడ సిగ్నల్ దాటాక వెనుక ద్వారం నుంచి దిగటానికి ప్రయత్నించి కిందపడ్డాడు. తల మీదుగా బస్సు వెనుక చక్రం వెళ్లటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ కోటరాజుపై కేసు నమోదు చేశారు.