కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో చేపట్టిన లాక్డౌన్ను హైదరాబాద్ నగరంలో పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. రహదారులపైకి వచ్చే వాహనదారులకు జరిమానాలు విధిస్తూ, అవసరమైతే వాహనాలు కూడా స్వాధీనం చేసుకుంటున్నారు.
'తప్పనిసరి అయితేనే బయటకు రావాలి' - hyderabad lockdown latest news
తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప బయటకు రావద్దు.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు పోలీసులు ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు.
'తప్పనిసరి అయితేనే బయటకు రావాలి'
నారాయణగూడ, హిమాయత్నగర్లలో అబిడ్స్ ఏసీపీ భిక్షం రెడ్డి, నారాయణగూడ సీఐ రమేష్ కుమార్ వాహనదారులకు పలు సూచనలు చేశారు. తప్పనిసరి పరిస్థితి ఉంటే తప్ప బయటకు రావద్దని కోరారు. లేనిపక్షంలో కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు.
ఇదీ చూడండి :కరోనా కట్టడికి తన వంతు ప్రయత్నం చేస్తోన్న సర్పంచ్