తెలంగాణ

telangana

ETV Bharat / state

గడపగడపలో వైసీపీ ఎమ్మెల్యేకు భంగపాటు.. పీతల కూర పంపుతానన్న గ్రామస్థుడు - వైసీపీ ఎమ్మెల్యే చిట్టిబాబు

MLA Chittibabu: ఏపీలోని కోనసీమ జిల్లా పి.గన్నవరం వాడ్రేవుపల్లిలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గడపగడపకు కార్యక్రమంలో ఓ హోటల్ నిర్వాహకుడి నుంచి చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తున్న సమయంలో, సదరు వ్యక్తి తెదేపాకే ఓటేస్తానని చెప్పడంతో.. ఎమ్మెల్యే అవాక్కయ్యాడు. దీంతో అక్కడ నుంచి ఎమ్మెల్యే చిట్టిబాబు వెనుతిరిగాడు.

MLA Chittibabu
MLA Chittibabu

By

Published : Nov 24, 2022, 8:24 PM IST

MLA Chittibabu: ఆంధ్రప్రదేశ్​లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం శాసన సభ్యుడు కొండేటి చిట్టిబాబు వాడ్రేవు పల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. పాపారాయుడు అనే హోటల్ నిర్వాహకుడి వద్దకు వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తున్న సమయంలో మీరు జై జగన్ అన్నా మేము మాత్రం టీడీపీకే ఓటు వేస్తామని స్పష్టం చేశాడు. హోటల్ నుంచి పీతల కూర పంపిస్తాను... అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. దీంతో ఎమ్మెల్యే చిట్టిబాబు అక్కడ నుంచి నిష్క్రమించారు.

గడపగడపలో వైసీపీ ఎమ్మెల్యేకు భంగపాటు.. పీతల కూర పంపుతానన్న గ్రామస్తుడు

ABOUT THE AUTHOR

...view details