తెలంగాణ

telangana

ETV Bharat / state

చంద్రబాబు రోడ్‌ షోలో ఉద్రిక్తత.. ప్లకార్డులతో వైకాపా నేతల నిరసన

Tension In Babu Ponnur Tour: ఆంధ్రప్రదేశ్​లో అధికార పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా ఈరోజు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రెచ్చగొట్టే చర్యలకు పూనుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

Tension In Babu Ponnur Tour
Tension In Babu Ponnur Tour

By

Published : Dec 8, 2022, 10:50 PM IST

Tension In Babu Ponnur Tour: ఆంధ్రప్రదేశ్​లోని పొన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో వైసీపీ నాయకులపైకి వెళ్లారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని వైసీపీ నేతలను అక్కడినుంచి పంపించి వేశారు.

చంద్రబాబు రోడ్‌ షోలో ఉద్రిక్తత.. ప్లకార్డులతో వైకాపా నేతల నిరసన

ABOUT THE AUTHOR

...view details