ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కంబదూరు మండలం కొత్తపల్లిలో వైసీపీ వర్గీయులు తమపై దాడి చేశారని తెలుగుదేశం సానుభూతిపరులు ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల క్రితం తాము నిర్మించుకున్న ఇంటి గోడను వైసీపీకి చెందిన సర్పంచ్ అనుచరులు కూల్చి వేశారని వాపోయారు. అడ్డుకునేందుకు యత్నించిన తమపై విచక్షణా రహితంగా దాడి చేశారని బాధితుడు వెంకటేశులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయని తెలిపారు.
ఇంటి గోడ విషయం.. టీడీపీ సానుభూతిపరులపై వైసీపీ వర్గీయుల దాడి - అనంతపురంలోని కొత్తపల్లిలో టీడీపీ కార్యకర్తలపై దాడి
గోడ కూల్చివేత వ్యవహారంలో టీడీపీ సానుభూతిపరులపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. 15 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇంటి గోడను వైసీపీకి చెందిన సర్పంచ్ అనుచరులు కూల్చివేశారని వాపోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కొత్తపల్లిలో చోటుచేసుకుంది.
ఇంటి గోడ విషయంలో గొడవ
గోడ విషయంపై గతంలో కోర్టును ఆశ్రయించగా.. తమకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని చెప్పారు. వెంకటేశులు, ఆయన భార్య లలితమ్మ కల్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు మాత్రం ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదని.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణే అని తెలిపారు.
ఇవీ చదవండి: