ఎప్పటిలాగానే ఉదయాన్నే లేచి ఆఫీస్‌కి వచ్చాను. డెస్కులో ఫోన్లు అనుమతి లేకపోవటంతో చరవాణికి ఫోన్ చేసి విసిగిపోయిన నా భార్య డెస్కు ఫోన్‌కు చేసింది. పెళ్లిరోజు శుభాకాంక్షలు అని చెప్పగానే షాకయ్యాను. మన మ్యారేజ్‌డే ఇవాళ కాదే అన్నాను. ఈరోజు ప్రపంచ వివాహ దినోత్సవం అనగానే ఇలాంటిది కూడా ఉందా అని ఆశ్చర్యపోయా? అవునూ..ఇవాళ వరల్డ్ మ్యారేజ్ డే.
ప్రపంచ పెళ్లి రోజు చరిత్ర తెలుసా?
స్నేహితుల రోజు, ప్రేమికుల రోజు విన్నాం కానీ మ్యారేజ్ డే కూడా ఉందని మీకు తెలుసా..! ఫిబ్రవరిలో వచ్చే రెండో ఆదివారం 'వరల్డ్ మ్యారేజ్ డే'గా జరుపుకుంటున్నారు. ఈసారి ఫిబ్రవరి రెండో ఆదివారం ఇవాళే.
1981లో బాటన్ రోగ్, లాస్ ఏంజెల్స్‌లో కొంతమంది దంపతులు మేయర్, గవర్నర్, బిషప్ దగ్గరికి వెళ్లి కలిశారు. తమకు పెళ్లిపై నమ్మకం ఉందని ప్రేమికుల రోజును 'we believe in marriage day'గా ప్రకటించాలని కోరారు. వీరికి ఓ ఆర్గనైజేషన్ మద్దతు తెలిపింది. చివరకు 1982లో 43వ గవర్నర్ అధికారికంగా 'మ్యారేజ్‌డే'ను ప్రకటించాడు.
ఏడాదికేడాది ఈ దినోత్సవం వివిధ దేశాలకు వ్యాప్తి చెందింది. 1983లో ' వరల్డ్ మ్యారేజ్ డే'గా పేరు మార్చటంతో పాటు, ఫిబ్రవరిలో వచ్చే రెండో ఆదివారం ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. ఇది ప్రపంచ వివాహ రోజు చరిత్ర.