భారత ఆహార సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ జనరల్ మేనేజర్ అశ్వనీ కుమార్ గుప్తా, ఇతర సీనియర్ అధికారులు మొక్కలు నాటారు. రాబోయే తరాలకు మనం అందించగలిగే అమూల్యమైన సంపద స్వచ్ఛమైన వాతావరణమేనని అశ్వనీకుమార్ గుప్తా అన్నారు. కొవిడ్ మహమ్మారి మన జీవన శైలిని ఎంతగానో ప్రభావితం చేసిందన్న ఆయన... ఒక రకంగా పర్యావరణ హిత జీవన శైలిని అలవరచుకోవడానికి దోహదం చేస్తుందన్నారు.
'రాబోయే తరానికి అందించే అమూల్యమైన సంపద స్వచ్ఛమైన వాతావరణం' - తెలంగాణ వార్తలు
రాబోయే తరానికి మనం అందించే అమూల్యమైన సంపద స్వచ్ఛమైన వాతావరణమని భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ అశ్వనీ కుమార్ గుప్తా అన్నారు. కొవిడ్ మహమ్మారి మన జీవన శైలిని ఎంతగానో ప్రభావితం చేసిందన్నారు. ఆ సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
భారత ఆహార సంస్థ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం
నానాటికీ తీవ్రమవుతున్న వాయు కాలుష్య దుష్ప్రభావాల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ జనరల్ మేనేజర్ అశ్వనీ కుమార్ గుప్తాతో పాటు డీజీఎమ్ ఘనశ్యామ్, ఏజీఎంలు సిల్కీ సోనా సింగ్లా, రాజన్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:CM KCR: పేదలకు ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో సర్కారు కృషి