ఆమె లేకుంటే సృష్టే లేదు... ఆమె జన్మనివ్వకుంటే బతుకే లేదు... ఆమె సహచర్యం లేనిదే సార్థకతే లేదు... ఆమె స్త్రీ... బిడ్డకు తల్లిగా, భర్తకు భార్యగా... అన్నకు చెల్లిగా అనీర్వచనీయమైన పాత్రలు పోషిస్తుంది. అందరి అవసరాలు తీరుస్తూ... ఎనలేని ప్రేమనందిస్తుంది. అలాంటి స్త్రీని అవమానించకుండా అర్థం చేసుకోండి. మహిళా దినోత్సవం రోజు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడమే కాకుండా ప్రతిరోజూ గౌరవించండి.
ఏ రోజైనా పోస్టింగ్ చాలు
మదర్స్ డే, ఫాదర్స్ డే, వాలంటైన్స్ డే, రిపబ్లిక్ డే, ఉమెన్స్ డే... ఇలా ఏ రోజు వచ్చినా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు హోరెత్తుతాయి. రోజూ కళ్లెదుటే ఉండే తల్లిదండ్రులనుప్రేమగా రోజుకొక్కసారి కూడా పలకరించని పిల్లలు... మదర్స్ డే రోజు అమ్మతో, ఫాదర్స్ డే రోజు నాన్నతో ఫొటోలు దిగి తెగ ప్రేమను ఒలకబోస్తుంటారు నేటి యువత. బస్సుల్లో, ఆటోల్లో, కళాశాలల్లో, ఆఫీసుల్లో చివరకి ఇంటి పక్కనున్న స్త్రీలను గౌరవించని పెద్దమనుషులు కూడా ఉమెన్స్ డే రోజు తెగ ఉపన్యాసాలిస్తుంటారు.
విలువలు, నిజాయతీ గురించి చెప్పే ప్రతిఒక్కరూ వాటిని మాటలకే పరిమితం చేయకుండా నిజంగా పాటించండి. సమాజంలో ఉండే మహిళలందరినీ గౌరవించండి.
ఇవీ చదవండి :15 నుంచి ఒక్కపూట బడి