ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన చెందిన మక్బుల్జాన్, అయూబ్ ఖాన్ దంపతుల కుమార్తె... రుబియాఖానమ్ ఉన్నత విద్యను అభ్యసించేందుకు పిలిప్పీన్స్ దేశానికి వెళ్లింది. అంతకుముందు ఆమె తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ లోన్ కోసం పట్టణంలోని ఓ బ్యాంకును సంప్రదించగా... వారు మంజూరు చేస్తామన్నారు. సరైన పత్రాలు అన్ని సమర్పించాలని కోరారు. బ్యాంకు మంజూరు చేసే రుణంపై ఆశతో, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే ఉపకారవేతనం వస్తుందన్న ధైర్యంతో... తమ దగ్గరున్న డబ్బు పెట్టి కుమార్తెను ఎంబీబీఎస్ విద్యను అభ్యసించేందుకు పిలిప్పీన్స్ దేశానికి పంపారు.
కుమార్తె భవిషత్తు కోసం తల్లి ఆమరణ దీక్ష
బ్యాంకు రుణం, ప్రభుత్వ ఉపకారవేతనం వస్తుందనే నమ్మకంతో ఉన్నత విద్య కోసం కుమార్తెను విదేశాలకు పంపంది ఓ తల్లి. తీరా బ్యాంకు రుణం మంజూరు కాకపోవడం, ప్రభుత్వం మంజూరు చేసే ఉపకారవేతనం సైతం రాని కారణంగా... విదేశాల్లో కూతురు ఇబ్బందులు పడుతోంది. సమస్యకు పరిష్కారం దొరక్క.. ఆ మాతృమూర్తి ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురంలో ఆమరణ దీక్షకు దిగింది.
కుమార్తె భవిషత్యు కోసం తల్లి ఆమరణ దీక్ష
తీరా అక్కడికి వెళ్లాక బ్యాంకు వారు... ఇంటికి అప్రూవల్ లేదని రుణాన్ని తిరస్కరించారు. ప్రభుత్వం నుంచి వస్తుందనుకున్న విదేశీ విద్య ఉపకారవేతనం పథకాన్ని రద్దు చేసిన కారణంగా.. ఇప్పుడు తమ బిడ్డ విద్య ఎలా సాగుతుందని ఆ తల్లి ఆవేదన చెందుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా తమ సమస్య పరిష్కారం కాలేదని.. ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొంది. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతుంది.
ఇదీ చదవండి:'నా భర్త చదివిన పాఠశాల వద్ద ఓ ఫొటో తీయండి'