తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీ పేరుతో మోసం... మహిళ అరెస్టు - సైబర్​ మోసాలు

నేను ఈటీవీలో డైరెక్టర్​ను. మీకు సినిమాలు, సీరియళ్లలో నటించే అవకాశం కల్పిస్తానంటూ ఓ మహిళ నకిలీ ఫేస్​బుక్​ ఖాతాను సృష్టించింది. పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రాచకొండ సైబర్​ క్రైమ్​ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఈటీవీ పేరుతో సైబర్​ మోసం

By

Published : Jun 22, 2019, 10:11 PM IST

ఈటీవీ డైరెక్టర్​ అంటూ మోసం... మహిళ అరెస్టు

నకిలీ ఫేస్​బుక్​ ఖాతా సృష్టించి... ఈటీవీ ప్రొడ్యూసర్​ అని చెప్పుకుంటూ పలువురిని మోసం చేస్తున్న శ్రీలత అనే మహిళను రాచకొండ సైబర్​ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఆమె చిత్తూరు జిల్లా వాయల్పాడుకు చెందినట్లు గుర్తించారు. నిందితురాలు తుమ్మల శ్రీదేవి పేరుతో నకిలీ ఫేస్​బుక్​ ఖాతా సృష్టించి ఈటీవీ డైరెక్టర్​, ప్రొడ్యూసర్​ అని ప్రచారం చేసుకుంది. గతేడాది వంశీ అనే వ్యక్తి నుంచి రూ.50 వేలు వసూలు చేసింది. 2017లో మాట్రిమోని పేరుతో క్రాంతి అనే యువకుణ్ని మోసగించి రూ.6 లక్షలు వసూలు చేసిన కేసులో పోలీసులు ఆమెను కటకటాల్లోకి నెట్టారు. సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తులతో స్నేహం చేయవద్దని సైబర్​ క్రైం అధికారులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details