Wine Shop Tender Last Date Telangana 2023 : తెలంగాణలో మద్యం వ్యాపారం లాభాల పంటగా భావిస్తుంటారు. అందుకే.. ఏటికేడు ఈ వ్యాపారం వైపు చొరవ చూపేవారి సంఖ్య పెరుగుతోంది. 2021లో మద్యం దుకాణాలు దక్కించుకోడానికి 68 వేలకుపైగా పోటీ పడ్డారు. దరఖాస్తుకు రూ.2 లక్షల (Liquor License) లెక్కన అప్పట్లో రూ.1357 కోట్లకుపైగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అయితే ఈసారి దరఖాస్తుల స్వీకరణ ద్వారా రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని అర్జించాలని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆ మేరకు తగిన చర్యలు తీసుకుంటోంది. నాలుగు రోజుల కిందట అర్జీల స్వీకరణ స్థితిగతులపై అబ్కారీశాఖ(Telangana Excise Department) మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
Telangana New Liquor License Applications 2023 : జిల్లాల వారీగా (New Bar License in Telangana 2023) వచ్చిన అర్జీల స్థితిగతులను పరిశీలించిన మంత్రి.. తక్కువగా దరఖాస్తులు వస్తున్న జిల్లాలకు ప్రత్యేక అధికారులను పంపించాలని, సిండికేట్లు ఏర్పడకుండా నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా బాగా తక్కువ దరఖాస్తులు వస్తున్న నిర్మల్, ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు హైదరాబాద్ నుంచి అబ్కారీ శాఖ అధికారులను పంపినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఏయే దుకాణాలకు తక్కువ దరఖాస్తులు వస్తున్నాయి.. గతంలోఆయా దుకాణాలకు ఎన్ని అర్జీలు వచ్చాయి, ఇప్పుడు ఎన్ని వచ్చాయి, తక్కువ వస్తుంటే.. ఎందుకు తగ్గుతున్నాయి తదితర అంశాలపై స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Telangana Liquor Shops Notification 2023 : తెలంగాణలో మూణ్నెళ్ల ముందే మద్యం టెండర్లు
Liquor Shop tenders in Telangana 2023 :రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ఈ నెల 4వ తేదీ నుంచి అర్జీల స్వీకరణ కొనసాగుతోంది. అయితే ఆశించినంతగా దరఖాస్తులు రాకపోవడంతో.. అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. గతంలో కంటే దాదాపు 30వేల దరఖాస్తులు అదనంగా వస్తేనే.. రాష్ట్ర ప్రభుత్వం అంచనాల మేరకు రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది.
బుధవారం ఒక్క రోజునే ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు 6,523 దరఖాస్తులు (Liquor License Application 2023) రాష్ట్రంలోని వివిధ అబ్కారీ కార్యాలయాలకు వచ్చినట్లు కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. నాలుగో తేదీ నుంచి బుధవారం వరకు మొత్తం 41,652 అర్జీలు అబ్కారీ శాఖకు అందాయి. దరఖాస్తుకు రూ.2 లక్షల లెక్కన ఇప్పటి వరకు అందిన అర్జీలకు వచ్చిన దరఖాస్తు రుసుం మొత్తం రూ.800 కోట్లు దాటింది. భారీ ఎత్తున అర్జీలు వేసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చే వ్యాపారులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా అబ్కారీ శాఖ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.