రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతోంది. భారీ వర్షాల ధాటికి మూసాపేట మెట్రో స్టేషన్ కింద ప్రధాన రహదారి కుంగింది. మెట్రో పిల్లర్ల చుట్టూ భూమి కుంగి గుంతల్లోకి నీరు చేరడంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది మోటార్ల ద్వారా నీటిని తోడిపోస్తున్నారు. రహదారిపై వెళ్లే వాహదారులకు ఇబ్బందులు లేకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ప్రమాదం జరిగే అవకాశముంటుందని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.
మెట్రో పిల్లర్ చుట్టూ కుంగిన రహదారి.. వదంతులు నమ్మొద్దన్న ఎన్వీఎస్ రెడ్డి - hyderabad news
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాల ధాటికి మూసాపేట మెట్రోస్టేషన్ కింద ప్రధాన రహదారి కుంగింది. వరదల వల్ల మెట్రో పిల్లర్లకు ఎలాంటి నష్టం జరగలేదని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.
దీనిపై మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. వరదల వల్ల మెట్రో పిల్లర్లకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు నుంచి భారీ వరద రోడ్లపైకి చేరిందన్నారు. వరదల వల్ల మెట్రో పిల్లర్ చుట్టూ ఉన్న మట్టి కొట్టుకుపోయిందని ఆయన వెల్లడించారు. మెట్రో విషయంలో వరద ప్రభావంపై ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నారని ఎండీ తెలిపారు. మెట్రో పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం లేదని.. వదంతులు నమ్మొద్దని మెట్రో ఎండీ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: హైదరాబాద్‌కు సమీపంలో తీవ్ర వాయుగుండం