తనను గెలిపిస్తే 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానని అడిక్మెట్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కవితా తిరుమలరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయిచరణ్ కాలనీ, విద్యానగర్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అవకాశం ఇస్తే ఉద్యోగి మాదిరిగా పనిచేస్తా: కవితా తిరుమలరావు - జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం
తనకు ఒక్క అవకాశం ఇస్తే.. ఇంటింటికి వెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని అడిక్మెట్ కాంగ్రెస్ అభ్యర్థి కవితా తిరుమలరావు తెలిపారు. తనలాంటి విద్యావంతులను గెలిపిస్తే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
అవకాశం ఇస్తే ఉద్యోగి మాదిరిగా పనిచేస్తా: కవితా తిరుమలరావు
ఓట్లు కోసమే కాకుండా.. గెలుపు అనంతరం ఒక ఉద్యోగి మాదిరిగా పనిచేస్తానన్నారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తనలాంటి విద్యావంతులకు అవకాశం కల్పిస్తే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.