తెలంగాణ

telangana

ETV Bharat / state

తమ సమస్యలను ఎమ్మెల్యేలకు విన్నవించిన గంగపుత్రులు - గంగపుత్రులు

పిప్రిలో గ్రామ బహిష్కరణ విధించి సుమారు 120 రోజుల దాటినా తమ సమస్యను ఎవరు పట్టించుకోవట్లేదని గంగపుత్రులు ఎమ్మెల్యేలకు తమ గోడును వెల్లబోసుకున్నారు. వెంటనే వీడీసీలపై కఠిన చర్యలు తీసుకుని గ్రామంలో పూర్వ పరిస్థితిని కల్పించాలని ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, ముఠా గోపాల్​ను కోరారు.

వీడీసీలపై కఠిన చర్యలు : ఎమ్మెల్యేలు జీవన్​రెడ్డి, ముఠా గోపాల్
వీడీసీలపై కఠిన చర్యలు : ఎమ్మెల్యేలు జీవన్​రెడ్డి, ముఠా గోపాల్

By

Published : Oct 31, 2020, 5:11 AM IST

హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్​లో తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్​ను పిప్రి గంగపుత్రులు కలిశారు. నిజామాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో తమను గ్రామ అభివృద్ధి కమిటీ బహిష్కరించిందని ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు. తమను గ్రామ బహిష్కరణ చేసి సుమారు 120 రోజులు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేరని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

పిప్రి నుంచి రాజధానికి..

పిప్రి నుంచి హైదరాబాద్​కు తరలివచ్చిన గంగపుత్రులు.. తెరాస సీనియర్ నేతలు స్వరూప బెస్త, వెంకటేష్ బెస్త నేతృత్వంలో ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రం అందించారు. స్పందించిన శాసనసభ్యులు గ్రామ అభివృద్ధి కమిటీపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నేతలు పేర్కొన్నారు.

ఇవీ చూడండి :రైతు వేదికల నిర్మాణంతో కొత్తశకం... నేడు ప్రారంభించనున్న సీఎం

ABOUT THE AUTHOR

...view details