డిసెంబరు 25.. క్రైస్తవులకు ఒక అతిముఖ్యమైన పర్వదినం. ఈరోజు ప్రతి క్రైస్తవ సోదరుని ఇంట ఒక నక్షత్రాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేస్తుంటారు. ఆ నక్షత్రానికి, మనుషులకు మధ్య అనుబంధం ఉందని వారి ప్రగాఢ విశ్వాసం. అందులో ఉండే త్రిభుజాలు, మూలాలు, గీతాలు.. మనుషుల సంబంధాలను సూచిస్తాయంటారు.
నక్షత్రంలో రెండు త్రిభుజాలు ఉంటాయి. పైకి ఉండే త్రిభుజం దేవుడిని, కిందివైపు ఉండే త్రిభుజం మానవుడిని సూచిస్తుంది. ఈ రెండు త్రిభుజాలు కలిగిన నక్షత్రం వారి నడుమ ఉన్న సంబంధాలకు సంకేతమని క్రైస్తవుల ప్రగాఢ విశ్వాసం.నక్షత్రంలో ఆరు మూలాలలో ప్రతి మూలం ఒక విషయాన్ని తెలియజేస్తుందట. పైమూలం దేవుడిగా, రెండోది సృష్టిగా, మూడోది ప్రత్యక్షంగా, నాలుగోది విమోచనగా, అయిదోది ఇశ్రాయేలుగా, ఆరోది అన్యులుగా తెలియజేస్తుందని పేర్కొన్నారు.