అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం క్రమంగా శ్రామిక పదం కనిపించకుండా పోయింది. ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే.. మార్చి 8కి దాదాపు 162 సంవత్సరాల చరిత్ర ఉంది. అమెరికాలో 1857 మార్చి 8న మొట్టమొదటి సారిగా నిరసన చేపట్టారు. అక్కడి బట్టల మిల్లులోని మహిళా కార్మికులు.. తమ పని గంటలను 16 నుంచి 10 గంటలకు తగ్గించమని కోరుతూ.. వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేశారు.
1910 మార్చి 8న క్లారాజెట్కిన్ అనే ఉద్యమ నాయకురాలు.. అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చింది. డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగన్లో జరిగిన ఇంటర్నేషనల్ వర్కింగ్ ఉమెన్ కాన్ఫరెన్స్లో ఈ ప్రతిపాదన చేశారు. అప్పటి నుంచి పలు దేశాల్లో మార్చి 8న ఉమెన్స్ డేగా జరుపుకుంటున్నాం.