తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో మొత్తం బస్సులు 2850 ఉన్నాయి. నగరంలో ఇప్పటికే అద్దె బస్సుల సేవలను అందుబాటులోకి గ్రేటర్ జోన్ అధికారులు తెచ్చారు. కొన్ని ప్రైవేటు పరిశ్రమలతోపాటు సంస్థలకు బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికులకు మాత్రం బస్సులు అందుబాటులో లేవు. బెంగళూరులో ఆర్టీసీ సేవలు ప్రారంభమైన వేళ.. ఇక్కడా ప్రభుత్వ ఆదేశాల కోసం చూస్తున్నామని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ అధికారులు చెబుతున్నారు. ఎప్పుడు ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఆ క్షణం నుంచే బస్సులను నడిపేందుకు సిద్ధమని టీఎస్‌ఆర్టీసీ ఈడీలు చెబుతున్నారు.
నగరంలో సిటీ బస్సుల సేవలెప్పుడు..?
ఐటీ రాజధాని బెంగళూరులో సిటీ బస్సుల సేవలు ఆదివారం నుంచి ప్రారంభమవుతున్నాయి. బస్సుపాస్‌లున్న వారినే అనుమతిస్తారు. ఒకవేళ లేకుంటే అప్పటికప్పుడు బస్సు పాస్‌లు తీసుకోవాలని బీఎంటీసీ (బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్) స్పష్టం చేసింది. అక్కడ సగం మందితోనే సిటీ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఈ నెల 17 వరకు లాక్‌డౌన్ ఉన్నా.. రవాణాలో ఇబ్బందులు దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం బస్సులను నడపాలని నిర్ణయించింది. అదే రీతిలో హైదరాబాద్‌లో కూడా ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం ఎప్పుడు నడిపిస్తుందా అని ప్రజలు చూస్తున్నారు.
నగరంలో సిటీ బస్సుల సేవలెప్పుడు..?
ఇదీ మొదటి దశ....
ప్రస్తుతం బస్సులన్నీ డిపోలకే పరిమితంకాగా.. వందలాది బస్సులు కరోనా అత్యవసర సేవల్లో పాలుపంచుకుంటున్నాయి. పొరుగు దేశాల నుంచి విమానాల్లో వచ్చిన వారిని క్వారంటైన్ సెంటర్లకు పంపించే పనిలో 20 మెట్రో లగ్జరీలు నిమగ్నమయ్యాయి. 12 కార్గో సేవలు కూడా వారి కోసమే కేటాయించారు.