పురాణకాలంలో దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం జరిపారు. అప్పుడు ముందొచ్చిన గరళాన్ని శివుడు మింగడం... దాన్ని కంఠంలో ఉంచుకోవడం వల్ల ఆ పరమేశ్వరుడు నీలకంఠుడయ్యాడు.
శివరాత్రి ఎందుకు జరుపుకుంటాం! - MAHA SHIVUDU
ప్రతి సంవత్సరం మనము ఎంతో ఘనంగా శివరాత్రి జరుపుకుంటాము. అసలు ఈ శివరాత్రి ఎందుకు జరుపుకుంటామో తెలుసా! పురాణాల్లో ఈ పర్వదినం జరపడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి.
ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉండేది. అందుకు ఆయనకు నిద్రరాకుండా దేవతలు, అసురులందరూ కలిసి ఐదు జాముల కాలం ఏకధాటిగా ఆడిపాడుతారు. ఆరోజు మాఘ బహుళ చతుర్దశి. వారు ఆడిపాడిన ఐదు జాముల కాలాన్నే మహాశివరాత్రి అని పిలుస్తారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వచ్చే బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినం జరుపుకుంటున్నాం.
ఆరోజు ఉపవాసం, జాగారణతో భక్తులు శివారాధన చేస్తారు. అలాగే శివపార్వతుల కల్యాణం, శివ లింగోద్భవం కూడా ఈరోజే జరిగాయని పురాణాల్లో ఉంది.