ఓ ప్రైవేట్ ఛానల్ సీరియల్లో నటిస్తున్న ఝాన్సీ 6 నెలలుగా సూర్యతో ప్రేమలో ఉంది. ఆ ప్రేమే చివరికి తన ప్రాణం తీసిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఝాన్సీ ఫోన్లోని ఆధారాలు... ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఆత్మహత్యకు ముందు సూర్యతో ఝాన్సీ వాట్సప్ చాట్ చేసినట్లు.. అరగంటపాటు సంభాషించినట్లు సమాచారం.
సూర్య పెట్టిన నిబంధన వల్లే సీరియల్స్‌కు ఝాన్సీ దూరంగా ఉంటోంది. వీరి ప్రేమ విషయంలో గత కొన్ని రోజులుగా వారి మధ్య ఘర్షణలు తలెత్తాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. అసలు ఆ వాట్సప్ చాట్‌లో ఏముంది?. ఏ విషయంలో గొడవ పడ్డారు అనే విషయాలు తెలిస్తేనే అసలు నిజాలు బయట పడతాయి. ఇప్పటికే ఝాన్సీ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు.