ఇటీవల వరదల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపుపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్, అక్టోబర్ వరదల్లో నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది.
'రైతులకు పరిహారం చెల్లింపుపై ఏం చర్యలు తీసుకున్నారు' - నష్టపోయిన రైతులకు పరిహారంపై హైకోర్టులో వ్యాజ్యం
రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపు విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అందుకు సంబంధించిన నివేదికను నాలుగు వారాల్లో సమర్పించాలని ఆదేశించింది.
'రైతుల నష్టపరిహారం చెల్లింపుపై ఏం చర్యలు తీసుకున్నారు'
పరిహారం, బీమా, పెట్టుబడి సాయం వంటి చర్యలపై పూర్తి వివరాలను నాలుగు వారాల్లో సమర్పించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చూడండి :జల వనరులు, పర్యావరణాన్ని కాపాడుకోవాలి: హైకోర్టు