రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొవిడ్ ను జయించిన 211 మంది పోలీసులకు ఘనస్వాగతం పలికారు. నాచారంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కరోనా... విజేతలకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. కరోనా పాజిటివ్ రాగానే ఎవరు భయపడవద్దని కమిషనర్ అన్నారు.
కరోనాను జయించిన 211 పోలీసులకు ఘనస్వాగతం - RACHAKONDA CP NEWS
రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొవిడ్ ను జయించిన 211 మంది పోలీసులకు ఘనస్వాగతం పలికారు. నాచారంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కరోనా... విజేతలకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
కరోనాను జయించిన 211 పోలీసులకు ఘనస్వాగతం
కరోనాతో బాధపడుతున్న పోలీస్ కుటుంబాలకు తమ వంతు సహకారం అందిస్తున్నామని సీపీ తెలిపారు. మెడికల్ కిట్స్, రోగ నిరోధక శక్తి పెంపు కోసం చవాన్ ప్రాశ్, డ్రై ఫ్రూట్స్ అందించడంతో పాటు రూ. 5,000లు వారి వారి అకౌంట్ లో జమ చేశామన్నారు. ప్లాస్మా డొనేట్ చేయడానికి ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని. కరోనాను జయించిన వారందరూ... ప్లాస్మా దానం చేయాలని కమిషనర్ సూచించారు.