వ్యవసాయ రంగాన్ని వేధిస్తున్న సవాళ్లల్లో రుతు పవనాలు ఒకటని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకుపలతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్ రావు అన్నారు. గత మూడేళ్ల నుంచి జర్మనీ పాట్స్‌డమ్ క్లైమెట్ ఇంపాక్ట్ సంస్థ... వర్షపాతానికి సంబంధించిన సమాచారం అందిస్తోందని తెలిపారు. ఈ సంస్థ శాస్త్రవేత్తలతో వెబినార్ సమావేశం నిర్వహించారు. ఇందులో 350 మంది పైగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నైరుతి రుతు పవనాల రాక, వర్షపాతం, వ్యవసాయ రంగంపై ప్రభావం వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. నైరుతి రుతుపవనాలు, వర్షాల ఆధారంగా రైతులు పంటల సాగు చేయాలని ప్రవీణ్ రావు సూచించారు.
ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు రాకపై సర్వత్రా చర్చ సాగుతున్న తరుణంలో... జూన్ 16 నుంచి 24 వరకు వర్షాలు వస్తాయని... ఆ తర్వాత జులై 16 నుంచి అక్టోబరు 13 వరకు వర్షాలు కురుస్తాయని ఉపకులపతి ప్రవీణ్‌రావు అన్నారు. గతేడాది కూడా ఎలెనా అంచనాలు సరిపోయాయని... ఈ సారి కూడా నైరుతి రుతుపవనాలు, వర్షాల ఆధారంగా రైతులు తమ పంటల సాగుకు ఉపక్రమించాలని ఆయన సూచించారు.