నైరుతి రుతుపవనాలు ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మెదక్, నల్గొండ, రెంటచింతల వరకు ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణలోని ఒకట్రెండు ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
TS RAINS: రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు - telangana varthalu
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల మూడు రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు
నైరుతి రుతుపవనాలు ఈ రోజు తమిళనాడు, కర్ణాటక అంతటా, మహారాష్ట్రలో మరికొంత భాగం తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లలో మరికొంత భాగం, ఈశాన్య భారతదేశ రాష్ట్రాలలోకి ప్రవేశించాయని సంచాలకులు వివరించారు,
ఇదీ చదవండి:'ఈ నెల 10లోపు ధరణిలో చేరిన రైతులకు నగదు జమ'