రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్య మధ్యప్రదేశ్లోని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలో మీటర్ల నుంచి 3.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో 2.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో రాగల మూడురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఈశాన్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రానున్న మూడురోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు