తెలంగాణ

telangana

ETV Bharat / state

weather update: రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు వర్షాలు - తెలంగాణకు వర్ష సూచన

రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం(ts weather) ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయని పేర్కొంది. రేపు ఏర్పడే అల్పపీడనం కారణంగా వర్షాలు పడనున్నాయి.

weather news in telangana, rain news in telangana
ts weather: రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు వర్షాలు

By

Published : Jun 10, 2021, 4:32 PM IST

ఈ నెల 5న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో పూర్తిగా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 11న(శుక్రవారం) ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో... రాగల 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు(ts weather) కురవనున్నాయి.

ఈ మేరకు ఐఎండీ సంచాలకులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని అన్నారు. అల్పపీడనం రాగల 24 గంటల్లో మరింత బలపడి... పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఒడిశా మీదుగా వెళ్లే అవకాశాలున్నాయని ఐఎండీ సంచాలకులు వివరించారు.

ఇదీ చూడండి:RAINS: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం

ABOUT THE AUTHOR

...view details