తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడు లక్షల మొక్కలు నాటుతాం: మంత్రి సత్యవతి

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు కానుకగా చేపట్టిన కోటి వృక్షార్చనలో భాగంగా గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమ శాఖలో మూడు లక్షల మొక్కలు నాటనున్నట్లు మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు.

'మా శాఖ తరఫున మూడు లక్షల మొక్కలు నాటుతాం'
'మా శాఖ తరఫున మూడు లక్షల మొక్కలు నాటుతాం'

By

Published : Feb 16, 2021, 2:28 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమ శాఖలో మూడు లక్షల మొక్కలు నాటనున్నట్లు మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. ఎంపీ సంతోశ్​కుమార్ చేపట్టిన కోటి వృక్షార్చన పిలుపులో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ, ఆశ్రమ పాఠశాలల్లో లక్ష మొక్కలు, గిరిజన గురుకులాల్లో లక్ష మొక్కలు, మహిళాభివృద్ధి- శిశు సంక్షేమ శాఖలో మరో లక్ష మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు చెప్పారు.

ఆదిమ జాతి గిరిజన బాలికల విద్య కోసం దేశంలో మొదటిసారి ఏర్పాటు చేసిన గురుకులంలో ఒకటైన హయత్​నగర్​లోని గిరిజన బాలికల గురుకులంలో మొక్కలు నాటి బాలికలకు నూతన దుస్తులు అందిస్తామని మంత్రి తెలిపారు. కూకట్​పల్లిలోని మహిళా, శిశు సంక్షేమశాఖ రెస్క్యూ హోమ్​లో కేవలం పండ్లు, పూలు, కూరగాయల మొక్కలు పెట్టి న్యూట్రీ గార్డెన్​గా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ గార్డెన్లలో వచ్చే కూరగాయలు, పండ్లు మహిళలు, శిశువులకు ఇచ్చే పౌష్ఠికాహారంలో భాగం చేయనున్నారు.

ఇదీ చదవండి :మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి కాంగ్రెస్ నామినేషన్

ABOUT THE AUTHOR

...view details