ఈనెల 21న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు తరలివచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆలయ ఈఓ అన్నపూర్ణ తెలిపారు. మహంకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా 27 మంది సభ్యులతో దేవాలయ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగను విజయవంతం చేస్తామని పేర్కొన్నారు.
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం - ఉజ్జయిని మహంకాళి
సికింద్రాబాద్‌లో ఈనెల 21న జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం
ఇవీ చూడండి: రైతువద్ద లంచం.. తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు