హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఇంజినీర్ల అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రభుత్వ విధులతోపాటు సామాజిక సేవలను కూడా అందిస్తామని సంఘం వెల్లడించింది. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని నేతలు చెప్పారు. రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలను పొందిన తాము... బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈమేరకు సభ్యులు తీర్మానం చేశారు.
సామాజిక సేవల్లో భాగస్వాములమవుతాం..!
హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఇంజినీర్ల సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రభుత్వ విధులతోపాటు సామాజిక సేవలు అందిస్తామని సంఘం తెలిపింది.
సామాజిక సేవల్లో కూడా భాగస్వాములమవుతాం..!