తెలంగాణ

telangana

ETV Bharat / state

'పారిశ్రామిక వేత్తలకు చేయూతనిచ్చే ప్రభుత్వానికే మా మద్దతు' - TIF on Ghmc elections

తమకు చేయూతనిచ్చే ప్రభుత్వానికే మద్దతిస్తామని తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య తెలిపింది. లింకు రోడ్లు, కమ్యుటర్ ఫెసిలిటీ, కరెంటు కోతలు లేని మౌలిక వసతులు కల్పనకు ప్రాధాన్యమిచ్చే వారికే తమ మద్దతని పేర్కొంది.

'పారిశ్రామిక వేత్తలకు చేయూతనిచ్చే ప్రభుత్వానికే మా మద్దతు'
'పారిశ్రామిక వేత్తలకు చేయూతనిచ్చే ప్రభుత్వానికే మా మద్దతు'

By

Published : Nov 24, 2020, 3:44 PM IST

పారిశ్రామిక వేత్తలు ఎదిగేలా చేయూతనిచ్చే ప్రభుత్వాలకే తమ మద్దతు ఉంటుందని తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య స్పష్టం చేసింది. ఒక పరిశ్రమ ఎదిగితే అందులో పనిచేసే ఉద్యోగులు, దానిపై ఆధారపడిన కుటుంబాలు బాగుపడతాయని టీఐఎఫ్ ప్రధానకార్యదర్శి గోపాల్​రావు అన్నారు.

లింకు రోడ్లు, కమ్యుటర్ ఫెసిలిటీ, కరెంటు కోతలు లేని మౌలిక వసతులు కల్పనకు ప్రాధాన్యమిచ్చే వారికి ఈ ఎన్నికల్లో మద్దతిస్తామని ఆయన ప్రకటించారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా 28 పారిశ్రామిక వాడలు, 60 వేల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, 2 లక్షల ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తోన్న తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్యతో ఈటీవీ భారత్ ముఖాముఖి...

'పారిశ్రామిక వేత్తలకు చేయూతనిచ్చే ప్రభుత్వానికే మా మద్దతు'

ఇవీచూడండి:'తెరాసకు ఓటేయండి... గ్రేటర్​ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం'

ABOUT THE AUTHOR

...view details