కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీలో తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కార్మికుల పాత్ర గొప్పదని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కార్మికులు ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్‌తో కార్మికులకు చేతి నిండా పని దొరుకుతోందని తెలిపారు. ఐటీఐలు, కంపెనీల మధ్య ఒప్పందం చేశామని చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తున్నామని అన్నారు.
కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం కృషి: మంత్రి మల్లారెడ్డి - కార్మికుల క్షేమమే లక్ష్యం: మల్లారెడ్డి
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో కార్మికులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గత పాలకులు కార్మికులను స్వప్రయోజనాలకు వాడుకున్నారని విమర్శించారు.
మల్లారెడ్డి
TAGGED:
labour minister