మా రిజర్వేషన్లు మాకు కావాలి - PANCHAYATHI RAJ MINISTER ERRABELLI DAYAKAR RAO
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు.
బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలి : ఆర్.కృష్ణయ్య
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వెనుకబడిన కులాలకురిజర్వేషన్లు 34 శాతానికి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ మాదిరిగా బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలన్నారు.