తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళా భద్రతకై... 'వీ ఆర్​ వన్'​ - WOMEN

మహిళ భద్రత కోసం హైదరాబాద్ పోలీసులు అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. షీటీమ్ ఆధ్వర్యంలో ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ...ప్రజల్లో భరోసా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17న 'వీ ఆర్​ వన్​ రన్​' నిర్వహించనున్నారు.

రండి భరోసానివ్వండి..!

By

Published : Mar 14, 2019, 6:45 PM IST

రండి భరోసానివ్వండి..!
దేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని, దానికి పోలీసులు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలే కారణమని నేర విభాగం అదనపు పోలీస్‌ కమిషనర్‌ శిఖా గోయల్ తెలిపారు. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా షీ టీమ్ ఆధ్వర్యంలో వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు చేపట్టిన పోలీసులు... ఈ నెల 17న నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో 'వీ ఆర్ వన్ రన్'​ నిర్వహించనున్నారు. రన్​కు సంబంధించిన లోగో, కిట్​ని శిఖా విడుదల చేశారు.

రిజిస్ష్రేషన్ చేసుకొండి..!

పాఠశాలలు, కళాశాల నుంచి దరఖాస్తులు వస్తున్నాయని శిఖాగోయల్​ తెలిపారు.16 మధ్యాహ్నం వరకు ఔత్సాహికులు రిజిస్ష్రేషన్​ చేసుకోవచ్చనివివరించారు. కార్యక్రమంలో గవర్నర్​తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు.

ఇవీ చూడండి:ఫేస్​బుక్​ లాగిన్​ అవుతోందా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details