నిత్య విద్యార్థుల్లా నేర్చుకోవాలి: వెంకయ్య - VNR
సమాజంలో జరిగే విషయాలను నిత్యం తెలుసుకుంటూ ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థులకు పిలుపునిచ్చారు. తన మజిలీలోనే ఎన్నో ఆసక్తికర విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు.
మనమంతా నిత్య విద్యార్థులమే...!
రాజకీయాల నుంచి విరమణ తీసుకున్నా.. ప్రజా జీవితంలో మాత్రం కొనసాగుతున్నానని ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాద్ బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్మించిన యోగయ్యనాయుడు భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిలాగా కొత్త విషయాలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. కొన్ని పత్రికల్లో వస్తున్న మార్పు తనకు సంతోషాన్ని కల్గిస్తుందన్నారు.