తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్రంలో ఈ నెల చివరి వారంలో భారీ వర్షాలు' - వర్షాభావ పరిస్థితులు

రాష్ట్రంలో ఇప్పటి వరకు 34 శాతం లోటు వర్షపాతం ఉందని హైదరాబాద్​ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి వానలు మాత్రమే కురుస్తాయని పేర్కొన్నారు. అయితే జులై చివరి వారంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిణి నాగరత్న వెల్లడించారు.

వాతావరణ శాఖ అధికారులు

By

Published : Jul 8, 2019, 8:46 PM IST

రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జులై రెండో వారం ప్రారంభమైనా ఇప్పటి వరకు కనీస వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు 34 శాతం లోటు వర్షపాతం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుండడం వల్ల ఉత్తరాదిన వర్షాలు పడుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే రెండు వారాల్లో కూడా పెద్దగా వానలు పడే సూచనలు కనిపించడం లేదని పేర్కొన్నారు. అయితే నెల చివరి నాటికి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారిణి నాగరత్నతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

వాతావరణ శాఖ అధికారిణి నాగరత్నతో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details