ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో విజయవాడలోని బరంపార్కు, భవానీద్వీపం జలాశయాలుగా మారాయి. భవానీద్వీపంలో ఐదడుగుల మేర నీరు చేరింది. ఇటీవల ఇక్కడ ప్రభత్వం కోట్ల రూపాయల ఖర్చుతో డైనోసర్ పార్కు, లేజర్ షో ఏర్పాటు చేసింది. నీరు చేరటంతో వాటికి నష్టం వాటిల్లింది. ప్రస్తుతం అక్కడికి వెళ్లే పరిస్థితి లేదనీ.. నష్టంపై కచ్చితమైన అంచనాకు రావడం కష్టమవుతోందని అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతితో పర్యటక రంగానికి భారీ నష్టం ఏర్పడింది. ద్వీపంలోని పరిస్థితులపై మా ప్రతినిధి జయప్రకాశ్ మరిన్ని వివరాలు అందిస్తారు.
భవానీ ద్వీపంలోకి నీరు.. పర్యటకులు లేక ఆదాయానికి గండి - విజయవాడ
విజయవాడలోని పర్యటక కేంద్రం భవానీ ద్వీపం వరద నీటితో అతలాకుతలమైంది. ద్వీపంలో ఐదడుగుల మేర నీరు చేరి.. కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన డైనోసర్ పార్కు, లేజర్ షోలు పాడయ్యాయి.
వరద నీటితో అతలాకుతలమైన భవానీ ద్వీపం