తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్కులకు అనుమతి లేక.. రోడ్లపై నడుస్తున్న వాకర్లు

కొవిడ్ వేళ ఆరోగ్యంపై భాగ్యనగరవాసుల్లో స్పృహ పెరిగింది. ప్రధానపార్కుల్లో ఉదయపు నడకకు వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరిగింది. లాక్​డౌన్ సందర్భంగా పార్కులు మూసివేయడం వల్ల వాకర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

walkers-problems-in-lockdown
పార్కులకు అనుమతి లేక రోడ్లపై నడుస్తున్న వాకర్లు

By

Published : May 16, 2021, 11:15 AM IST

కొవిడ్ 19 ప్రారంభం నుంచి... చాలా మంది ప్రజల్లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పెరిగాయి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో... లేక్ వ్యూ పార్క్, సంజీవయ్య పార్క్ ... బంజారాహిల్స్​లోని కేబీఆర్ పార్క్ సహా... తదితర ప్రాంతాల్లో రోజూ వందలాదిమంది ఉదయపు నడకకు వెళ్తున్నారు.

పార్కులకు అనుమతి లేక రోడ్లపై నడుస్తున్న వాకర్లు

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో... చాలా మంది రోజు మాదిరిగానే పార్కులకు వెళ్లగా మూసేసి ఉంచడం వల్ల వెనుతిరిగి వెళ్తున్నారు. లాక్​డౌన్ సమయంలో... రోజు ఉదయం 4 గంటలపాటు వ్యాపార కేంద్రాలకు వెసులుబాటు ఇచ్చిన ప్రభుత్వం.. పార్కులు కూడా​ తెరవాలని పలువురు వాకర్లు కోరుతున్నారు. పార్కులు మూసివేయడం వల్ల.. రోడ్లపై నడుస్తున్నారు. దీనివల్ల నెక్లెస్ రోడ్డులో వాకర్ల సందడి కనిపించింది.

ABOUT THE AUTHOR

...view details