VRO Harassed A Women: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పీఎల్‌పురం గ్రామానికి చెందిన వీఆర్వో ఓ మహిళను వేధింపులకు గురిచేశాడు. గ్రామానికి చెందిన దళిత మహిళ ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోగా.. ఆమెకు సాంకేతిక కారణాల వల్ల స్థలం మంజూరు కాలేదు. దీన్ని ఆసరాగా తీసుకున్న వీఆర్వో ఆ మహిళ సెల్‌ఫోన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురి చేశాడు.
మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీఆర్వో.. దేహశుద్ధి చేసిన బంధువులు.!
VRO Harassed A Women : అధికారం చేతిలో ఉంది కదా అని.. కొంతమంది అధికారులు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా.. ఆ పేరుతో సాధారణ ప్రజలను వేధింపులకు గురిచేసిన ఘటనలు రాష్ట్రంలో సర్వసాధారణం అయిపోయాయి. ప్రజా సేవలో భాగంగా సక్రమంగా బాధ్యత నిర్వర్తించాల్సిన ప్రభుత్వాధికారులు.. ప్రజలకు కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. ఏపీలోని అనకాల్లి జిల్లాలో ఓ మహిళ.. ప్రభుత్వ అధికారి వేధింపులకు గురైంది. అసలేం జరిగింది.
వీఆర్వో
దీన్ని అవకాశంగా తీసుకుని గ్రామంలో పనిచేస్తున్న వీఆర్వో భాస్కర్ నాయుడు.. ఆ మహిళను తన కోరిక తీర్చాలంటూ, తనతో సహజీవనం చేయాలంటూ సెల్‌ఫోన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురి చేసేవాడు. దీంతో అతని వేధింపులు భరించలేక బాధిత మహిళ బంధువులకు తెలియజేయడంతో పంచాయతీకి పిలిపించి వీఆర్వో ను నిలదీసి దేహశుద్ధి చేశారు. అనంతరం జరిగిన ఈ పూర్తి విషయాలను పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: